స్పీకర్‌ కోడెలతో వైయస్‌ఆర్‌సీపీ నేతల భేటీ

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  స్పీకర్ తో భేటీ అయ్యారు. వైయస్‌ఆర్‌ సీఎల్పీ, ప్రతిపక్ష నేత కార్యాలయాల కేటాయింపుపై వారు చర్చించారు. అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించలేదని వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు రాలేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆక్షేపించారు.చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు.

Back to Top