హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తరపున జిల్లా పరిశీలకులుగా నియమితులైన నాయకులు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఆయా జిల్లాల్లోని పార్టీ పరిస్థితిని సమీక్షించారు. ఈ నెల 29 న పార్టీ చేపట్టిన బంద్ కోసం చేయాల్సిన ఏర్పాట్ల మీద చర్చించారు. ఈసందర్భంగా పార్టీ రూపొందించిన పోస్టర్ ను సీనియర్ నాయకులు ఆవిష్కరించారు. పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక హోదా సాధించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వక పోవటంతో బంద్ అనివార్యం అయిందని ఆయన వివరించారు.