వైయస్‌ఆర్‌సీపీ ఓట్లు గల్లంతు

హైదరాబాద్‌: ఏపీలో వైయస్‌ఆర్‌సీపీ ఓట్లు గల్లంతు అవుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వారు ఎన్నికల అధికారి సిసోడియాను వైయస్‌ఆర్‌సీపీ నేతలు కలిశారు. ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్ల తొలగింపుపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రతి నాలుగు ఓట్లలో ఒక ఓటు తొలగించారని అంబటి రాంబాబు మండిపడ్డారు. సత్తెనపల్లెలోనే 15 వేల ఓట్లు గల్లంతయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నరసారావుపేటలోనూ భారీగా అక్రమాలు జరిగాయని తెలిపారు. గల్లంతైన ఓట్లపై విచారణ జరిపించి న్యాయం చేయాలని ఎన్నికల అధికారిని కోరారు.
 
Back to Top