వైయస్ జగన్ కు భద్రత కల్పించాలి

 

చిత్తూరు :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 26 నుంచి చిత్తూరు జిల్లాలో చేపట్టనున్న ప్రజాసంకల్పయాత్రకు అనుమతితో పాటు భద్రత కల్పించాలని పార్టీ సీనియ‌ర్‌ నేతలు బుధవారం జిల్లా ఎస్పీని కలిశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌ బాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, తిప్పారెడ్డి, నారాయణస్వామి, డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో పాటుగా పార్టీ నేతలు జంగలపల్లి శ్రీనివాసులు, బియ్యపు మధుసూధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  .


Back to Top