జయ అంత్యక్రియలకు వైయస్సార్సీపీ నేతలు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరుకానున్నారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ తదితరులు అమ్మ అంత్యక్రియల్లో పాల్గొంటారు. ఈ మేరకు వైయస్సార్సీపీ ఎంపీలు మంగళవారం ఉదయం చెన్నైకు బయలుదేరి వెళ్లారు. జయలలితకు వైయస్సార్సీపీ తరఫున నేతలు నివాళులర్పించనున్నారు.

Back to Top