దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం

  • దళితులకు అండగా వైయస్‌ఆర్‌ సీపీ
  • గరగపర్రు సమస్యను వైయస్‌ జగన్‌కు వివరిస్తాం
  • నిందితులను అరెస్టు చేయకపోతే తీవ్ర పరిణామాలు
  • మెడిసిన్‌ అందకుండా చేశారని దళితుల ఆవేదన 
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు
పశ్చిమ గోదావరి: గరగపర్రులో దళితులపై సాంఘీక బహిష్కరణ జరిగితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో వైయస్‌ఆర్‌ సీపీ కమిటీ సభ్యులు ధర్మాన, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్ల నాని, మేరుగు నాగార్జునలు పర్యటించారు. అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు వివాదానికి సంబంధించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. గరగపర్రు బాధితులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ధర్మాన స్పష్టం చేశారు. దళితులకు న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన పార్టీ పోరాడుతుందని వారికి భరోసా ఇచ్చారు. వాస్తవ పరిస్థితులను ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

వెంటనే అరెస్టులు చేయాలి..
గ్రామంలో దళితులను బహిష్కరించి వారిని అణగదొక్కుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం రెండు నెలలుగా మొద్దు నిద్రపోతుందని ధర్మాన మండిపడ్డారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. బలరామకృష్ణంరాజుతో సహా నిందితులను అరెస్టు చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. 

బాధితులతో కమిటీ సభ్యుల ముఖాముఖి...
అంబేద్కర్‌ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేశాం. ఏప్రిల్‌ 23న విగ్రహాన్ని చెరువుగట్టు సెంటర్‌లో పెట్టాం. రాత్రికి రాత్రే అంబేద్కర్‌ విగ్రహాన్ని తొలగించారు. కోర్టు వివాదమున్న నేపథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దన్నారు. అన్ని విగ్రహాలను తొలగించినప్పుడు మేము కూడా అక్కడి నుంచి అంబేద్కర్‌ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పినా వినిపించుకోలేదు. అన్ని కులాలు శివాలయంలో సమావేశమయ్యారు. మే 5 లోపు విగ్రహాన్ని తొలగించాలని డెడ్‌లైన్‌ పెట్టారు. ఆ తరువాత నుంచి మమ్మల్ని సాంఘీక బహిష్కరణ చేశారు. పాలు కూరగాయాలు, మందులు కూడా అందకుండా చేశారు. 
Back to Top