తహశీల్దార్‌ను సన్మానించిన వైయస్సార్‌సీపీ నేతలు

దాచేపల్లి: స్థానిక తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన కూచిపూడి నెహ్రూబాబును వైయస్సార్  కాంగ్రెస్‌ పార్టీ నేతలు మంగళవారం ఘనంగా సన్మానించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో నెహ్రూ బాబును కలిసి శాలువా, పూలదండలతో జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, మండల, పట్టణ కన్వీనర్లు షేక్‌ జాకీర్‌హుస్సేన్, మునగా పున్నారావు, సర్పంచ్‌ బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డిలు సన్మానించారు. మండలంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని తహసీల్దార్‌ నెహ్రూ బాబును కోరారు.

Back to Top