అగ్ని ప్ర‌మాద బాధితుల‌కు సాయం

ప్ర‌కాశం: అగ్ని ప్ర‌మాదంలో స‌ర్వం కోల్పొయిన బాధితుల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అండ‌గా నిలిచారు. ప్ర‌కాశం జిల్లా చీరాల మండలం ఓడరేవు గ్రామంలో ఇటీవ‌ల‌ జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో ఓసిపల్లి శేషమ్మ ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. విష‌యం తెలుసుకున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అంద‌జేశారు. అలాగే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆయ‌న వెంట‌ పార్టీ నాయ‌కులు పిన్నిబోయిన రామకృష్ణ; పిక్కి కాశీరావు, త‌దిత‌రులు ఉన్నారు.


Back to Top