తిరుపతి: ప్రజల తరపున పోరాడటంలో వైఎస్సార్సీపీ ఎప్పటిలాగే ముందంజలో ఉంది. స్థానిక పరిస్థితుల మీద ప్రజాస్వామ్య విధానంలో పోరాడుతోంది. చిత్తూరు జిల్లా నగరిలో సమస్యల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోగ్యం క్షీణిస్తోంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఈటీటీ ప్లాంట్లను తక్షణమే ప్రారంభించాలనే డిమాండ్‑తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు దీక్షకు దిగారు. దీక్ష చేస్తున్న కౌన్సిలర్ గౌరీ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయారు. దీంతో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.