రైతు కళ్లలో ఆనందం వైయస్‌ఆర్‌ చలువే

ఆత్మకూరు: రైతే రాజు.. రైతు మొహంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశ్యంతో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం తీసుకొచ్చారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గుర్తు చేశారు. బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత మహానేత వైయస్‌ఆర్‌దన్నారు. సిద్ధాపురం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వద్ద వైయస్‌ఆర్‌ గంగాహారతి కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీదేవితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముచ్చుమ్రరి, హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగా, పులికనుమ, గురురాఘవేంద్ర ప్రాజెక్టులను చేపట్టి లక్షల ఎకరాలను వైయస్‌ఆర్‌ సాగులోకి తీసుకొచ్చారన్నారు. దాదాపు 90 శాతం పనులను వైయస్‌ఆర్‌ పూర్తి చేస్తే... 10 శాతం పనులు పూర్తి చేసి తానే ప్రాజెక్టులు చేపట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వద్ద పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో తరలివచ్చి పండుగ చేసుకుంటున్నారని, ఇదంతా వైయస్‌ఆర్‌ కృషి వల్లేనన్నారు. మళ్లీ వైయస్‌ఆర్‌ లాంటి పాలన రావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని, అది ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమవుతుందన్నారు. 
Back to Top