చేరికలతో పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్

  • వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు
  • పెద్దాపురంలో పెద్ద ఎత్తున ర్యాలీ
  • బీసీలకు పెద్ద పీట వేసేది వైయస్సార్సీపీయే
  • ఎప్పుడు ఎన్నికలొచ్చినా జిల్లాలో 19సీట్లు సాధిస్తాం 
  • వైయస్సార్సీపీ తూ.గో. జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
తూర్పుగోదావరిః పార్టీలోకి భారీ చేరికలతో వైయస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పెద్దాపురంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు అరుణా శ్రీనివాస్‌ యాదవ్‌ టీడీపీని వీడి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైయస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో శ్రీనివాసయాదవ్ తో పాటు మరో 500మంది వైయస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా  పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ... రాష్ట్రానికి సరైన నాయకత్వం అందించగలిగి ప్రజలకు మేలు చేయగల సత్తా వైయస్ జగన్ కు మాత్రమే ఉందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అనుభవజ్ఞుడని ప్రజలు బాబును ముఖ్యమంత్రిని చేస్తే...అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశాడని ధ్వజమెత్తారు,

పోలీసులను పావుగా వాడుకొని చంద్రబాబు తప్పుడు కేసులు బనాయిస్తున్నాడని, బాబు కేసులకు వైయస్సార్సీపీ భయపడదని హెచ్చరించారు.  వైయస్సార్సీపీ అధికారానికి చేరువవుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా కూడ క్యాంపు రాజకీయాలు చేస్తూ బాబు ఓటర్లను ప్రలోభపెట్టాడని మండిపడ్డారు. బాబు లాగ తప్పులు చేసే మనస్తత్వం తమ నాయకుడిది కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశ్యంతో తమ నాయకుడు మూడు జిల్లాల్లో మాత్రమే వైయస్సార్సీపీ అభ్యర్థులను పోటీకి నిలిపారని చెప్పారు. కానీ బాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడ సిగ్గులేకుండా ఓటర్లను కొంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు, విలువలు విశ్వసనీయత గల నాయకుడు వైయస్ జగన్ అని కన్నబాబు అన్నారు.  ఎప్పటికప్పుడు నాలుక మడతేసే కార్యక్రమం చేయడం బాబు నైజమని దుయ్యబట్టారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా జిల్లాలో 19సీట్లను గెలవగల సత్తా  వైయస్సార్సీపీకి ఉందని చెప్పారు. 

శ్రీనివాస్ యాదవ్
టీడీపీలో యాదవులకు, బీసీ కులస్థులకు గుర్తింపు లేదని పార్టీలో చేరిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. యాదవులు ఇంకా చాలా మంది వైయస్సార్సీపీలోకి రావాల్సి ఉన్నా, టీడీపీ నాయకులు వారిని భయపెట్టి ఆపుతున్నారని మండిపడ్డారు. బీసీలకు పెద్ద పీఠ వేస్తున్న పార్టీ ఒక్క వైయస్సార్సీపీ మాత్రమేనని శ్రీనివాస్ చెప్పారు.  వైయస్ జగన్ అడుగుజాడల్లో నడుస్తామని స్పష్టం చేశారు. 
Back to Top