ప్రభుత్వ కార్యక్రమంలో డ్యాన్సులు సిగ్గుచేటు

వైయస్‌ఆర్‌ జిల్లా: జన్మభూమి ప్రభుత్వ కార్యక్రమంలో డ్యాన్సులు వేయడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబులు జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు పబ్బం గడుపుకునేందుకు జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు పింఛన్లు, రేషన్‌లోని 9 సరుకులు అందేవని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పింఛన్, రేషన్‌ రావడం లేదని అడిగిన లబ్ధిదారులను పోలీసుల చేత దాడి చేయిస్తున్నారని, కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఈ నాలుగేళ్లుగా చంద్రబాబు ఒక్కరికీ న్యాయం చేయలేదన్నారు. 
Back to Top