జేసీ బ్రదర్స్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలిఅనంతపురం :  టీడీపీ నేతలు జేసీ దివాక‌ర్‌రెడ్డి, ప్ర‌భాక‌ర్‌రెడ్డిల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు డిమాండు చేశారు. జేసీ బ్రదర్స్‌ దౌర్జన్యాలను నిరసిస్తూ గురువారం ఆందోళన చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, మాజీఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి నియోజ‌క‌వ‌ర్గ‌ సమన్వయ కర్త పెద్దారెడ్డి, హిందూపురం పార్లమెంట్ ఆధ్యక్షులు శంకర్‌ నారాయణ మాట్లాడుతూ..తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసులను ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి బెదిరించినా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యమని మండిపడ్డారు.  సాక్షి విలేకరిపై జేసీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని, జేసి బ్రదర్స్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. 
 

Back to Top