ప్రజాస్వామ్యం గురించి బాబు మాట్లాడటం హాస్యాస్పదంవైయస్‌ఆర్‌ జిల్లా: ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అకేపాటి అమర్నాథ్‌రెడ్డి విమర్శించారు. కడపలో నిర్వహించిన వైయస్‌ఆర్‌సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణతరగతుల్లో వారు మాట్లాడారు. బెరైటీస్‌ గనుల విషయంలో ఏపీఎండీసీ అవినీతికి నిలయంగా మారిందని కులం, పార్టీ అడగనిదే ఏ పని చేయడం లేదన్నారు. రెండు కంపెనీలకు మేలు జరిగేలా టెండర్‌ నిబంధనలు మార్చారని విమర్శించారు. అన్నింటిపై విజిలెన్స్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. గ్రామ కమిటీలపై కేసులు ఎత్తివేయాలన్నారు. ప్రజా స్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రమణ దీక్షితులు నుంచి ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతున్నారని వివరించారు. వైయస్‌ఆర్‌ కుటుంబంపై మంత్రి ఆదినారాయణరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆదినారాయణ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 
 
Back to Top