ఎంపీని విమర్శించే స్థాయి రాంగోపాల్‌కు లేదు

పులివెందుల : కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిని విమర్శించేస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుడు రాంగోపాల్‌రెడ్డికి లేదని పులివెందుల వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. శనివారం స్థానిక పాత ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో వారు మాట్లాడుతూ.. 2012-13 రైతుల పంటల బీమా గురించి వైయస్‌ అవినాష్‌రెడ్డిని విమర్శిస్తున్న రాంగోపాల్‌రెడ్డికి... హైదరాబాద్‌లోని బీమా కంపనీ ఎదుట రైతులతో కలిసి వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి, వైయస్‌అవినాష్‌రెడ్డిలు ధర్నా చేసిన విషయం మరిచావా అని ప్రశ్నించారు. అలాగే వైయస్‌అవినాష్‌రెడ్డి ఢిల్లీలోని ఇన్సూరెన్స్‌కంపెనీతో చర్చించి కేంద్రం నుంచి రావల్సిన నిధుల గురించి పోరాడిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటం కోసం చవకబారు విమర్శలు రాంగోపాల్‌రెడ్డి మానాలని హితవు పలికారు. గత మూడేళ్ల నుంచి ప్రజా సమస్యలు గాలికి వదిలి ఇప్పుడే తెదేపా కార్యాలయంలో అడుగుపెట్టిన రాంగోపాల్‌రెడ్డి వైయస్‌ఆర్‌సీపీపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top