ప్రత్తిపాటి అక్రమాలను ఎండగడుతాం

గుంటూరు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అక్రమాలను ఎండగడతామని వైయస్సార్ సీపీ నాయకులు ప్రకటించారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం యడవల్లిలో వైయస్సార్ సీపీ నేతలు ఆదివారం పర్యటించారు. 416 ఎకరాల సొసైటీ భూములను మంత్రి పుల్లారావు అనుచరులు కబ్జాకు ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లారు. బాధిత దళితులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. గజం భూమి లాక్కున్నా సహించేది లేదని హెచ్చరించారు. వైయస్సార్ సీపీ నాయకులు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ముస్తఫా, పిన్నేల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు యడవల్లిలో పర్యటించారు.

Back to Top