నిలదీసిన వారిని అరెస్టు చేయడం దారుణం

విజయవాడ: జన్మభూమి సమావేశాలు టీడీపీ కార్యక్రమంలా మారాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు మండిపడ్డారు. జన్మభూమి కార్యక్రమంపై అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ.. సమస్యలపై జన్మభూమి కమిటీలు, అధికారులను నిలదీస్తే అరెస్టులు చేయడం దారుణమన్నారు. గత జన్మభూమిలో వచ్చిన అర్జీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. 

Back to Top