టీడీపీ నాయకుల పిరికిపంద చర్య

వైయస్సార్ జిల్లా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రను టీడీపీ నాయకులు అడ్డుకోవాలనుకోవడం పిరికిపంద చర్య అని వైయస్ఆర్ సీపీ నాయకులు అంజాద్ బాషా, సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి అవినీతిని ప్రశ్నించినందుకు వైయస్ జగన్పై అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయని చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు.  రైతు భరోసా యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు టీడీపీ నాయకులు పన్నుతున్న కుట్రలను ప్రజలు తరిమికొడతున్నారు. వైయస్ జగన్ కు యాత్రకు జనం భారీగా తరలివస్తున్నారు.

Back to Top