కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన

వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షాల గొంతు అసెంబ్లీలోనే కాకుండా సభలు, సమావేశాల్లో కూడా నొక్కేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. పులివెందుల జన్మభూమి సభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు వైయస్‌ అవినాష్‌రెడ్డి ప్రసంగాన్ని చంద్రబాబు అడ్డుకున్నాడని నిరసనగా కడపలో ఆందోళన చేపట్టారు. నిరసనలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 85 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టును పూర్తి చేసి మేమే చేశామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. వైయస్‌ఆర్‌ కృషిని సభలో వివరిస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డిని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. గతంలో కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగిన సభలో కూడా ప్రసంగిస్తున్న దళిత ఎమ్మెల్యే ఐజయ్య ప్రసంగాన్ని కూడా చంద్రబాబు అడ్డుకున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top