వైయస్సార్సీపీ నేతల ధర్నా..అరెస్ట్

రాజమండ్రి:

 అర్హులైన పేదలకు పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం ధర్నా చేపట్టారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్‌రావు, షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
 

Back to Top