వైఎస్సార్సీపీ నేతల ధర్నా

అనంతపురంః  నిరుపేదల పొట్టగొడుతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు ఉరవకొండలో ధర్నాకు దిగారు. అంత్యోదయ కార్డు ద్వారా లబ్దిదారులకు పంపిణీ చేసే బియ్యంలో భారీగా కోత విధిస్తున్నారని ఆరోపిస్తూ.. అర్హులైన లబ్దిదారులతో కలిసి వైఎస్సార్సీపీ నాయకులు ధర్నా చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎంపిటిసి విజయకుమార్ మాట్లాడుతూ.. అంత్యోదయ కార్డు ద్వారా ప్రతి లబ్దిదారునికి 35 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 15 కేజీలు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు.

నిరుపేదలకు ఇచ్చే బియ్యంలో సగానికిపైగా కోత విధిస్తే వారు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. లబ్దిదారులతో కలిసి తహశీల్దార్ వద్దకు వద్దకు సమస్యను తీసుకెళ్లారు. నెలరోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని అధికారులు హామీ ఇచ్చారు. ధర్నాలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నాయకులు ఖాదర్ బాషా, జిలాన్ తదితరులు పాల్గొన్నారు

తాజా ఫోటోలు

Back to Top