విద్యుత్ ఛార్జీల మోత..వైఎస్సార్సీపీ నేతల ధర్నా

అనంతపురం(కల్యాణదుర్గం) : విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ జిల్లాలోని  కల్యాణదుర్గం విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట  వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నాకు దిగారు. టీడీపీ ప్రభుత్వం వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక్కసారి కూడా  విద్యుత్‌ చార్జీలను పెంచలేదని, కానీ ఈ ప్రభుత్వం మాటిమాటికీ ఛార్జీలను పెంచి ప్రజలకు కుచ్చుటోపీ పెడుతోందని విమర్శించారు.  వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు, రూరల్ కన్వీనర్ తిరుమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

Back to Top