ఉత్సవాలతో సామరస్య వాతావరణం

నెల్లిమర్ల: ఉత్సవాలతో అన్నివర్గాల ప్రజల్లో సామరస్య వాతావరణం నెలకొంటుందని వైయస్సార్‌సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. నగరపంచాయతీ పరిది కొండపేటలో గురువారం ప్రారంభమైన దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొండపేటలో వినాయక, దసరా ఉత్సవాలను ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఉత్సవాలతో కాలనీవాసుల్లో ఆధ్మాత్మికభావం పెంపొందుతుందని చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతిష్టించిన దుర్గామాతకి సాంబశివరాజు ప్రత్యేకపూజలు జరిపించారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ నేతలు చెనమల్లు వెంకటరమణ, జానా ప్రసాద్, ఉత్సవకమిటీ ప్రతినిధి అల్లం సూర్యనారాయణ, సారిపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top