గరగపర్రు బాధితులకు పరామర్శ

మామిడికుదురు : పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలను పి.గన్నవరం నియోజకవర్గ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శుక్రవారం పరామర్శించారు. కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి బాధితులను పరామర్శించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించి, దళితులను గ్రామ బహిష్కరణ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధితులను పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు కొమ్ముల కొండలరావు, కశిరెడ్డి ఆంజనేయులు, యూవీవీ సత్యనారాయణ, పెట్టా జగన్, కమిడి వెంకటేశ్వరరావు, పాముల దేవీప్రకాష్, విప్పర్తి మహేష్, నక్కా వెంకటేశ్వరరావు, నాగవరపు నాగరాజు, కొండేటి వికాష్‌ తదితరులున్నారు. కాగా కాకినాడలో గురువారం జరిగిన వైయస్సార్‌ సీపీ ప్లీనరీని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు కో ఆర్డినేటర్‌ చిట్టిబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top