రాజేశ్వరిని పరామర్శించిన నేతలు

వెల్దుర్తిపాడు(పెనుగంచిప్రోలు): గ్రామంలో టీడీపీ నాయకుల దాడిలో కాలు విరిగిన యువతి వై. రాజేశ్వరిని గురువారం వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను, జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథిలు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ నాయకులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, మండల నాయకులతో పాటు జిల్లా, రాష్ట్ర నాయకుల అండగా ఉంటారన్నారు. మహిళలపై కూడా దాడులు చేయటం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఇది టీడీపీ దిగుజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, స్థానిక నాయకులు పోపూరి రామకోటేశ్వరరావు ,పొన్నం కోటేశ్వరరావు, శివాజీ, జీతం వెంకయ్య, తోక కృష్ణ, పి. కృష్ణ, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. 

Back to Top