జగ్గరాజు కుటుంబానికి వైయస్సార్‌ సీపీ నాయకులు పరామర్శ

గంగలకుర్రు(అంబాజీపేట) : గంగలకుర్రులో ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వాడ్రేవు జగ్గరాజు కుటుంబ సభ్యులను సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి పరామర్శించారు. జగ్గరాజు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోథైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో నెల్లి పండు, మాత సత్యనారాయణ, వంగా రామకృష్ణ, విప్పర్తి మహేష్‌లు పరామర్శించినవారిలో ఉన్నారు.

Back to Top