వైయస్సార్‌సీపీ నాయకుల పరామర్శ

అమడగూరు : మండల కేంద్రమైన అమడగూరుకు చెందిన పోతే లక్ష్మినారాయణను మండల వైయస్సార్‌సీపీ నాయకులు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో భాదపడుతుండగా, విషయం తెలుసుకున్న వైయస్సార్‌సీపీ నాయకులు భాదితుడి కుటుంబానికి వెళ్లి కొడుకు చిట్టిబాబును, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడకండని, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టౌన్‌ కన్వీనర్‌ సుధాకర్‌రాజు, యువనాయకులు, మెడికల్స్‌ సూరి, గోపి, హరినాథరెడ్డి, సుబ్బిరెడ్డి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Back to Top