సుబ్బరాజు మృతికి వైయస్సార్‌సీపీ నేతల సంతాపం

మొసలపల్లి(అంబాజీపేట) :మొసలపల్లిలో దివంగత దంతులూరి వెంకట సుబ్బరాజు కుటుంబ సభ్యులను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శనివారం పరామర్శించారు. సుబ్బరాజు మృతి గ్రామానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, నాయకులు ఎం.ఎం.శెట్టి, కొర్లపాటి కోటబాబు, పేరి శ్రీనివాస్, మట్టపర్తి నాగేంద్ర, సుంకర రామకృష్ణ, బూడిద వరలక్ష్మి, మట్టపర్తి శ్రీనివాస్, సూదాబత్తుల రాము, కాగితాపల్లి సుబ్బారావు, నెల్లి పండు, పితాని కాళి, కొండేటి స్టాలిన్‌ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. గంగలకుర్రు పెదగరువుకు చెందిన గుత్తుల సూరిబాబు, బూడిదవారిపేటలో కుంచె శ్రీనివాసరావు, కుమ్మరిగరువులో మానేపల్లి పార్వతి, గుంటూరి సత్యప్రభావతి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాల సభ్యులను కూడా కొండేటి చిట్టిబాబు, ఎంపీటీసీ బూడిద వరలక్ష్మి, కాగితాపల్లి సుబ్బారావు, నెల్లి ఏడుకొండలు, కూటం జానకిరామ్, నెల్లి సుబ్రహ్మణ్యం, తరవట్ల సత్యనారాయణ, యల్లమిల్లి రాంబాబు, వాసంశెట్టి సత్యనారాయణ, సానబోయిన ఏసు, బూడిద సూర్యనారాయణ పరామర్శించారు.

Back to Top