అక్ర‌మ కేసుల‌పై వైయ‌స్సార్సీపీ నేత‌ల ఫిర్యాదు

గుంటూరు) వైయస్సార్సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మీద పోలీసులు అక్ర‌మ కేసులుపెడుతున్నార‌ని పార్టీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్  ఆరోపించారు. దీనిపై  మర్రి రాజశేఖర్, పొన్నూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త రావి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డిలు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి సమస్యను విన్నవించారు.

అనంతర మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు.  టీడీపీ నేతలకు నీరు-చెట్టు కార్యక్రమం వ్యాపారంలా తయారైందని ఆయ‌న‌ విమర్శించారు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో అక్రమంగా చెరువును తవ్వేందుకు అధికార పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అడ్డువచ్చిన గ్రామస్తులు, పెద్దలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లోని మట్టి, ఇసుకను మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలు అడ్డూ అదుపు లేకుండా అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. దీనిని అడ్డుకున్న గ్రామస్తులపై అక్రమంగా కేసులు పెట్టారని, దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు.
Back to Top