జన సునామీతో టీడీపీ గుండెల్లో రైళ్లు

కంచరపాలెం బహిరంగ సభకు వచ్చిన ప్రజలను చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అంటున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబును గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కంచరపాలెం సభ తేటతెల్లం చేస్తుందన్నారు. విశాఖలో  వైయస్‌ జగన్‌ సభ చ్రరితలో నిలిచిపోతుందన్నారు.ప్రజా స్పందన చూస్తే వైయస్‌ జగనే  కాబోయే ముఖ్యమంత్రి అనేది ప్రస్ఫుటమవుతుందన్నారు. విశాఖకు రైల్వేజోన్‌తో పాటు ఉత్తరాంధ్రకు ప్రత్యేకప్యాకేజీ  జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. ప్రజలు వైయస్‌ జగన్‌లో రాజన్నను చూసుకుని మురిసిపోతున్నారన్నారు.
Back to Top