హోదాపై వైఎస్సార్సీపీ నేతల గళం..!

వైఎస్ జగన్ నాయకత్వంలో పోరు..!

గుంటూరుః ప్రత్యేకహోదా కోసం రాజీలేని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కోసం రాష్ట్ర ప్రజానీకమంతా గొంతెత్తి నినదిస్తోంది. జగన్ అన్నా నీవెంటే మేమున్నామంటూ హోదాకోసం గళమెత్తుతున్నారు. పెద్ద సంఖ్యలో దీక్షాస్థలికి చేరుకొని తమ సంఘీభావం తెలుపుతున్నారు. హోదా సాధించేందాకా పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ నేతలు ర్యాలీలు, రిలేదీక్షలు, ధర్నాలు చేస్తున్నారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి...
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే  ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి జగన్ కు మద్దతు తెలపాలన్నారు. కేంద్ర,రాష్ట్రాలు దిగివచ్చి హోదా ఇచ్చేవరకు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుందని చెవిరెడ్డి తేల్చిచెప్పారు. లక్ష్యం నెరవేరేవరకు అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. 

వాసిరెడ్డి పద్మ...
శిలవలు పలవలు చేసి ఆంద్రజ్యోతి చేస్తున్న ప్రసారాలపై ఎస్సార్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఓ ఉద్యోగి భార్య చనిపోయిన విషయాన్ని సాక్షికి, వైఎస్ జగన్ కు ఆపాదిస్తూ...బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ కుట్రపూరితంగా నీచమైన సంస్కారంతో వెలువరిస్తున్న కథనాలు చూస్తే హోదా రాకుండా బాబుకు సహకరిస్తున్నారనిపిస్తోందన్నారు.  మీ సంస్థలో ఉద్యోగి నేరం చేస్తే ఇలాగే రాస్తారా...తెలుగుదేశం పార్టీ వాళ్లు నేరం చేస్తే చంద్రబాబు ఇంట్లో దాక్కున్నట్లేనా అని నిలదీశారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలేగానీ, అసత్య ప్రసారాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణను పద్మ హెచ్చరించారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్...
వైఎస్ జగన్ పోరాటం పోరాటం మాత్రమే కాదని హోదా సాధించేవరకు దీక్ష చేస్తారని వైఎస్సార్సీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. హోదా  ఇస్తామన్నవాళ్లు, తెస్తామన్న వాళ్లు సైలెంట్ అయిపోవడం క్షమించరాని నేరమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ ఎన్నో పోరాటాలు చేశారని, ఐనా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు . 

గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి..
రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ప్రతిపక్ష నాయకుడు ధైర్యం చేసి దీక్ష చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూడడం దారుమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ కు పేరొస్తుందని, దీక్ష ఘనవిజయం సాధిస్తుందని  ఓర్వలేక మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. వైఎస్ జగన్ చేస్తున్న దీక్షకు ప్రజలంతా స్వచ్చందంగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారన్నారు . తమ అధినేత దీక్ష చేయడాన్ని ప్రధాన ప్రతిపక్షంగా  మేం గర్విస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రత్యేకహోదా సామాన్యులకు అర్థం కావాలన్న రీతిలో గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల్లో రిలే దీక్షలు, ర్యాలీలు వంటావార్పులు చేపడుతున్నామన్నారు. 

జోగి రమేష్..
మాజిల్లాలో సైకో సొల్లుగాడు ఉన్నాడు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతాడంటూ వైఎస్సార్సీపీ నేత జోగిరమేష్ మంత్రి దేవినేని ఉమపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, సైకో సొల్లుగాడు కలిసి కుయుక్తులు పన్నుతూ.....ప్రజల చిరకాల వాంఛ పోలవరాన్ని పక్కనబెట్టి పట్టిసీమ పేరుతో దోపిడికి తెరదీశాన్నారు. పట్టిసీమను జాతికి అంకితం చేయడానికి అది ఏమన్నా జాతీయ ప్రాజెక్టా అని జోగి రమేష్ చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. నధుల అనుసంధానం చేశానంటూ డబ్బాలు కొట్టుకొని వందలాది బస్సులు తీసుకొచ్చి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పండగ చేశారని దుయ్యబట్టారు. ఎలుకలు, కోతులు,కుక్కలు కరిచి పిల్లలు చనిపోతున్నారు.  చంద్రబాబు చూపులకు కూడా  పిల్లలు చనిపోయే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. పోలవరం కోసం కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు దోచుకుంటున్నారని మీ పాలకపక్షం నేత వీర్రాజే నిలదీస్తుంటే ఏం సమాధానం చెబుతావ్ అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ దీక్షకు ప్రతిఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

సర్వేశ్వర్ రావు..
చంద్రబాబు పాలన బ్రిటీష్ పాలనను తలపిస్తోందని వైఎస్సార్సీపీ నేత సర్వేశ్వర్ రావు తెలిపారు.  వాళ్లు దేశాన్ని దోచుకున్నట్లే. చంద్రబాబు రాష్ట్ర ప్రజల సంపద దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ప్రాణాలు పణంగా పెట్టి ప్రత్యేకహోదా కోసం దీక్ష చేపడితే ..ముఖ్యమంత్రి , మంత్రులు తలో మాట మాట్లాడుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఏరకంగా దోచుకోవాలి, దాచుకోవాలన్నదే వారి అభిమతమని ఎత్తిపొడిచారు. చంద్రబాబుకు ఎంతసేపు  ఎయిర్ పోర్టులు, సీపోర్టులు ,సింగపూర్ లు, జపాల పేరుతో దోచుకోవడం తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు.  
Back to Top