రాష్ట్ర‌వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌- వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల దీక్ష‌కు మ‌ద్ద‌తుగా అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు
 అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు  ఎంపీల దీక్ష‌కు మ‌ద్ద‌తుగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించిన అనంతరం మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు నేరుగా ఏపీ భవన్‌కు వచ్చి దీక్షలో కూర్చోవ‌డం ప‌ట్ల రాష్ట్ర ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ‘ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాల’నే నినాదాలు హోరెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాయి. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. ఇవాళ క్యాండిల్ ర్యాలీ, రేపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నిరాహార దీక్ష‌లు చేప‌ట్ట‌నున్నారు.

తాజా వీడియోలు

Back to Top