శిల్పాను గెలిపించుకుందాం

నంద్యాలః వైయస్ జగన్ ప్రకటనతో ఆర్యవైశ్యులు సంతోషంగా ఉన్నారని వైయస్సార్సీపీ నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్ లు తెలిపారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైయస్ జగన్ ప్రకటించడం హర్షనీయమన్నారు. నంద్యాల పర్యటనలో వీరు మాట్లాడుతూ...రోడ్ల వెడల్పులో ఆస్తులు కోల్పోయిన వారికి వైయస్ జగన్ న్యాయం చేస్తారని భరోసా కల్పించారు. కేశవరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటారని చెప్పారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు కాబట్టే చంద్రబాబు కేశవరెడ్డి జోలికి పోవడం లేదని వారు అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో వైయస్ జగన్ అందరకీ న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. శిల్పా మోహన్ రెడ్డిని గెలిపిస్తే నంద్యాల జిల్లా కేంద్రం అవుతుందని, మోడల్ టైన్ గా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

Back to Top