వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు భారీ ర్యాలీ

తూర్పు గోదావరి: గొల్లప్రోలు మండల పరిధిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శనివారం భారీ ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మాజీమంత్రి కొప్పన మోహన్‌రావు పార్టీలో చేరి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో ఆయనకు స్వాగతం పలకడానికి గ్రామాల నుంచి పార్టీనాయకులు, కార్యకర్తలు బైక్‌ర్యాలీ నిర్వహించారు. చేబ్రోలులోని ఈబీసీ కాలనీ నుంచి సుమారు 150 మోటార్‌సైకిళ్లతో చే బ్రోలు, దుర్గాడకు చెందిన పార్టీ నాయకులు ర్యాలీ చేపట్టారు. గొల్లప్రోలు, తాటిపర్తి, చెందుర్తి, కొడవలి, చినజగ్గంపేట గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.

Back to Top