కాలేజ్ వార్షికోత్స‌వంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

చిత్తూరు: మదనపల్లె విశ్వం కాలేజ్ వార్షికోత్సవ వేడుక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు పాల్గొన్నారు. రాజంపేట లోక్ సభ సభ్యులు, యువ నేత పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి,  పీలేరు శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి,  మదనపల్లె శాసన సభ్యులు  దేశాయ్ తిప్పారెడ్డి, తంబళ్లపల్లి వై యస్ ఆర్ సీపీ ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి ద్వారకా నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. వీరికి క‌ళాశాల యాజ‌మాన్యం అపూర్వ స్వాగ‌తం ప‌లికింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..యువ‌త రాజ‌కీయాల్లోకి రావాల‌న్నారు. యువ‌త చేతుల్లోనే దేశ భ‌విష్య‌త్తు ఉంద‌ని చెప్పారు. యువ‌త భ‌విష్య‌త్తు కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోరాడుతున్న‌ట్లు చెప్పారు.  

Back to Top