వివాహానికి హాజరైన వైయస్సార్‌సీపీ ప్రముఖ నాయకులు

కంబదూరు:మండలంలోని పాల్లూరు గ్రామానికి చెందిన వైయస్సార్‌సీపీ నాయకుడు బోయ గంగాధర్‌ కుమారై రోజా, రాజగోపాల్‌ల వివాహా కార్యక్రమానికి వైయస్సార్‌సీపీ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, రాష్ట్రకార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డిలు వేరువేరుగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో అధ్యక్షులు అండేపల్లి బాబురెడ్డి, బీసీ విభాగాల జిల్లా ప్రధాన కార్యదర్శులు ములకనూరు గోవింద్, చిక్కనాగన్న, రామకృష్ణ, దొడగట్ట సూరి, బొజ్జన్న, టైలర్‌శీనా, వినోద్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top