టీడీపీ నేతల దాదాగిరి

శెట్టూరు: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అనప్పల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేయని పనులను చేసినట్లు చెప్పుకోవడంపై వైఎస్సార్సీపీ నేతలు తెలుగుతమ్ముళ్ల జనచైతన్యయాత్రను అడ్డుకున్నారు. దీంతో, ఒక్కసారిగా రెచ్చిపోయిన టీడీపీ నేతలు  వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపర్చారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ  కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Back to Top