రాష్ట్ర బంద్ లో ఉద్రిక్తత...నేతల అరెస్ట్

వైయస్సార్సీపీ శ్రేణులపై పోలీసుల జులూం
శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేతలపై దౌర్జన్యం
ఎక్కడిక్కడ అరెస్ట్ లు..స్వచ్చంధంగా బంద్ లో పాల్గొన్న ప్రజలు

ఏపీః రాష్ట్రానికి ప్రత్యేకహోదాను ప్రకటిచాలనే డిమాండ్ తో వైయస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ పలు చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. హోదా కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైయస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జ్ కు పాల్పడ్డారు.  ప్రత్యేకహోదా ఏపీ ప్రజల హక్కు నినాదంతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఇచ్చిన పిలుపుమేరకు పార్టీల నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు. ఐతే, ప్రజాస్వామ్యపద్ధతిలో ధర్నా, రాస్తోరోకో చేపట్టిన  వైయస్సార్సీపీ నేతలను, మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్ లలో పడేశారు. నాయకులను , కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్ట్ లు చేశారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. విద్య, వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 
రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేవరకు విశ్రమించే ప్రసక్తే లేదని వైయస్సార్స్పీ శ్రేణులు నినదించాయి. టీడీపీ, బీజేపీల కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డాయి. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని విస్మరించిన టీడీపీ, బీజేపీలకు ప్రజాకోర్టులో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించాయి. 


Back to Top