వైయస్‌ఆర్‌సీపీ నాయకుల అరెస్టు


పశ్చిమ గోదావరి: చింతలపూడిలో పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులను అరెస్టు చేశారు.  రేపటి గురు పూజోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ ఎలిజా, మండల కన్వీనర్‌ జానకిరెడ్డి, బొడ్డు వెంకటేశ్వరరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎలిజా, జానకిరెడ్డి, వెంకటేశ్వరరావులను వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు. 
 
Back to Top