బొత్స, ముస్తాఫా, అప్పిరెడ్డి అరెస్టు


గుంటూరు:   అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే ముస్తాఫా, లేళ్ల అప్పిరెడ్డిల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేర‌కు వారిని దుగ్గిరాల పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. దీంతో పెద్ద ఎత్తున వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు దుగ్గిరాల‌కు త‌ర‌లివ‌చ్చారు. నాయ‌కుల‌ను విడుద‌ల చేయాల‌ని నినాదాలు చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల అరెస్టును పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, అంబ‌టి రాంబాబు ఖండించారు. వెంట‌నే విడుద‌ల చేయ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని పోలీసుల‌ను హెచ్చ‌రించారు. కాగా, గుర‌జాల‌కు వెళ్ల‌కుండా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి, కాసు మ‌హేష్‌రెడ్డి త‌దిత‌రుల‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో న‌ర‌స‌రావుపేట‌లో ఉద్రిక్త‌త నెల‌కొంది.
Back to Top