వైెెఎస్సార్ ఆశయాల కోసం పనిచేస్తాం: వైెఎస్సార్సీపీ నేతలు

హైదరాబాద్) దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం పనిచేస్తామని వైెస్సార్సీపీ నాయకులు ప్రతిన పూనారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ సేవల్ని స్మరించుకొన్నారు. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారిన నేతలు ఇప్పుడు చాలా బాధ పడుతున్నారని ఆయన అన్నారు. మరో నేత, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. వైెఎస్సార్సీపీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని అన్నారు. ఉదయించే సూర్యుడ వైఎస్ జగన్ అన్న అని అభివర్ణించారు. తెలుగువాడి సత్తా ఢిల్లీ దాకా చాటి చెప్పిన ఘనత ఒక్క వైఎస్ జగన్ అన్న కే దక్కుతుందని అభిప్రాయ పడ్డారు. 
Back to Top