పరామర్శకు కూడా అనుమతి కావాలా

విజయవాడ: ఆంధ్రరాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహం రోజు రోజుకు మితిమీరిపోతుంది. ఫెర్రీ ఘాట్‌ వద్ద ప్రమాద స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఘాట్‌కు వెళ్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయం వద్ద సుమారు గంటన్నర పాటు నేతలను నిలిపివేశారు. పరామర్శకు కూడా అనుమతి కావాలా అంటూ వైయస్‌ఆర్‌ సీపీ నేతలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఫెర్రీ ఘాట్‌కు వెళ్తున్నారు.. ఆయన వెళ్లిన తరువాత గంటకు వెళ్లాలని, ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందంటూ కుంటి సాకులు చెబుతున్నారని నేతలు మండిపడ్డారు.

Back to Top