టీడీపీ శవ రాజకీయాలు మానుకోవాలి

అంబటి రాంబాబు
గుంటూరు: వినుకొండ రోడ్డు ప్రమాదంపై టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం పోలీసులను వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కలిశారు.  రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారన్నారు. బొల్లా బ్రహ్మనాయుడిని అన్యాయంగా కేసుల్లో ఇరికించాలని చూస్తుందని, వైయస్‌ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఈ అన్యాయంపై దర్యాప్తు చేయాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. టీడీపీ నాయకులు బ్రహ్మనాయుడిని వేధిస్తే చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. తప్పులు చేసి జైలుకు వెళ్లిన చరిత్ర ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుదని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ముస్తాఫా, నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top