రైతులకు న్యాయం చేయాలని ఆందోళన

తూర్పుగోదావరి: తాత్కాలిక ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం రైతుల నోట్లో మట్టికొడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోఆర్డినేటర్‌ జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. పురుషోత్తపట్నం రైతులకు న్యాయం చేయాలంటూ సీతారాంపురం జంక్షన్‌ వద్ద వందలాది మంది కార్యకర్తలు, రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను లాక్కుంటూ వారిని నట్టేట ముంచుతున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

Back to Top