వైయస్సార్‌సీపీ ఫ్లెక్సీల చించివేతపై ఆందోళన

లింగపాలెం : కె గోకవరం శివారు అన్నపనేనివారిగూడెం గ్రామంలో వైయస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన  ప్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చింపివేయడంపై వైయస్సార్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. వారిని శిక్షించాలని స్థానిక కార్యకర్తలు దొడ్డి గర్ల బాబురావు, భత్తుల ప్రభాకరావు,డి రవి,సురేంద్రం,ఎం శేఖర్, డి రాము,డి సులోమోన్,ఎం వెంకటేవ్వరావు,మాజీ ఎంపీటీసీ డి శాంతమ్మ నినాదాలు చేశారు. ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు కావాలని  ప్లెక్సీలు చింపివేశారని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పార్టీని లేకుండా చేసేందుకు కొందరు వ్యక్తులు కక్షపట్టారన్నారు. దీంట్లో భాగంగగానే గత కొంతకాలంగా వైయస్సార్సీపీ కార్యకర్తలపై 12 అక్రమకేసులు పెట్టారని వీరు తెలిపారు. ఏసయమంలో ఏమిజరుగుతందోనని గ్రామంలో బిక్కు బిక్కు మంటూ కాలంగడపవల్సి వస్తుందని కార్యకర్తలు భయందోళన చెందుతున్నామన్నారు. కేసులు భరించలేక కొందరు వ్యక్తులు గ్రామం విడిచి దూరప్రాంతంలో ఉంటున్నారని వీరు పేర్కొన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top