వైయస్‌ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది


ప్రకాశం: ఏపీ పునర్వీభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదాపై వైయస్‌ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లు టీడీపీ ప్రధాని మోడీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు. బుట్టా రేణుకను పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశానికి పిలువడంలోనే బీజేపీ–టీడీపీ కుమ్మక్కు రాజకీయం వెల్లడైందన్నారు. 
 
Back to Top