అభివృద్ధి..సంక్షేమం రెండు కళ్లుగా వైయస్‌ఆర్‌ పాలన

అమెరికా: రాజకీయాలకు అతీతంగా అందరికీ మేలు చేయాలనేతత్వం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిదని మాజీ ఎంపీ, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి..సంక్షేమం రెండు కళ్లుగా వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు. గల్లీ నుంచి ఢిల్లీదాకా అందరినీ ఒప్పించే నేర్పరితనం ఆయన సొంతమన్నారు. అమెరికాలో నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రతో వైయస్‌ఆర్‌ సువర్ణ పాలన అందించారన్నారు. ప్రజల గుండెల్లో చెరగని సంక్షేమ సంతకంగా నిలిచిన ఔన్నత్యం ఉన్న నాయకుడని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తిస్థాయిలో వైయస్‌ఆర్‌ పాలన సాగించారన్నారు. మహానేత ఏపీ ప్రజలకు ఎలాంటి పాలన అందించారో..ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా నవరత్నాల పథకాల ద్వారా అలాంటి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తారన్నారు. రాజన్న రాజ్యాన్ని వైయస్‌ జగన్‌ తీసుకొస్తారని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
 
Back to Top