పదవులకన్నా.. ప్రజా సంక్షేమమే ముఖ్యం

టీడీపీ కుట్రలను ఇంటింటికీ ప్రచారం చేయాలి
పామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
చింతలపూడి బాధితుల పట్ల న్యాయపోరాటం చేస్తాం
పాదయాత్ర దిగ్విజయం చేసిన పశ్చిమ ప్రజలకు కృతజ్ఞతలు
పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేసిన పశ్చిమ ప్రజలకు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా చంద్రబాబు చేతిలో మోసపోయిన ప్రజలు వైయస్‌ జగన్‌ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారన్నారు. టీడీపీని నమ్మిన ప్రజలు గత ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లను కట్టబెడితే ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరిలో అన్ని స్థానాలు వైయస్‌ఆర్‌ సీపీ గెలుచుకునేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రజలకు మేలు చేస్తామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ చేసిన కుట్రలను ఇంటింటికీ ప్రచారం చేయాలన్నారు. హోదా సాధన కోసం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో ఎంపీ పదవులకు రాజీనామాలు చేశామని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. 25 ఎంపీ స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీని గెలిపిస్తే ప్రత్యేక హోదా కచ్చితంగా సాధించగలుగుతామన్నారు.

జిల్లాలోని పామాయిల్‌ రైతులకు గిట్టుధర కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. అదే విధంగా చింతలపూడి ఎత్తిపోతల రైతాంగానికి న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని, బాధితుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
Back to Top