ఇప్ప‌టికైనా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలిఅమ‌రావ‌తి: ప‌్ర‌త్యేక  హోదా కోసం వైయ‌స్ ఆర్‌సీపీ చిత్త‌శుద్ధితో పోరాటం చేస్తుంద‌ని, హోదా సాధ‌న‌కే తాము ఐదుగురు ఎంపీ ప‌ద‌వులకు రాజీనామా చేశామ‌ని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్ప‌టికైనా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాల‌ని ఆయ‌న సూచించారు. వైయ‌స్ఆర్‌సీపీ డ్రామాలాడుతుంద‌న్న చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఖండించారు. ఎవ‌రు నాట‌కాలు ఆడుతున్నారో ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని హెచ్చ‌రించారు. ఎన్‌డీఏ ప్ర‌భుత్వంపై మొద‌టిసారిగా అవిశ్వాస తీర్మానం పెట్టింది వైయ‌స్ఆర్‌సీపీనే అన్నారు.  ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమ‌ర‌ణ దీక్ష‌కు కూర్చున్నామ‌ని, మా రాజీనామాల‌ను ఆమోదించుకున్నామ‌న్నారు. మీకు ద‌మ్ము, ధైర్యం ఉంటే రాజీనామాలు చేసి ఆమోదించుకోవాల‌న్నారు.  ఉప ఎన్నికలకు తాము సిద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీపీని గెలిపించడానికి మానసింగా సిద్ధమయ్యారన్నారు.  

 
Back to Top