ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాం


న్యూఢిల్లీ: ప్రజలను నమ్ముకొని మేం రాజకీయాలు చేస్తున్నామని, చంద్రబాబులా విలువలను అమ్ముకోలేదని వైయస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండు రోజులుగా చంద్రబాబు, నారా లోకేష్‌ ఇష్టం వచ్చినట్లు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, ఉప ఎన్నికల్లో మేం పోటీ చేస్తామన్నారన్నారు. నిన్న మాత్రం ఉప ఎన్నికలు రావని చంద్రబాబే చెప్పారన్నారు. లోకేష్‌ మాత్రం రాజీనామాలు పెద్ద డ్రామా అన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం మేం చిత్తశుద్ధితో రాజీనామాలు చేశామని ప్రజలు నమ్ముతున్నారని, మీ తండ్రీ కొడుకుల సర్టిఫికెట్‌తో పని లేదన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న మీ సర్టిఫికెట్, విలువలు లేని రాజకీయాలు చేసే మీ సర్టిఫికెట్‌ మాకొద్దన్నారు. ఉప ఎన్నికలు మాకు కొత్త కాదన్నారు. ఈ రోజు ఉప ఎన్నికలు జరగవని చంద్రబాబు చెబుతున్నారని, ఆయనకు ఎవరు చెప్పారో చెప్పాలని పట్టుబట్టారు. మేం ఏప్రిల్‌ 6న రాజీనామా చేశామన్నారు. ఉప ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. మేం ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నామని, మీలాగా విలువలు అమ్ముకొని రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. మా పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ధైర్యంతో, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారన్నారు. విలువలు, విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేయడం లేదన్నారు.విభజన హామీల సాధనకు నాలుగేళ్లుగా పోరాటం చేశామని తెలిపారు. ప్రజల్లోకి వెళ్తామని, మోసం చేసిన బీజేపీ, టీడీపీలకు బుద్ధి వచ్చేలా ప్రజలు తీర్పు ఇస్తారన్నారు.

 
Back to Top